టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం AK47’ (Aadarsha Kutumbam AK47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన త్రివిక్రమ్.. చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో మరో టాలెంటెడ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
మనకు తెలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్లతో పాటు సెకండ్ లీడ్ లేదా కీలకమైన మహిళా పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో భాగంగా ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కోసం బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో చర్చలు జరపడం, నివేదా కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని సమాచారం. ఇప్పటికే ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రధాన కథానాయికగా నటిస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నివేదా పేతురాజ్ చిన్న పాత్రలో మెరిసారు. కానీ, ‘ఆదర్శ కుటుంబం AK47’ లో మాత్రం ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా, కాస్త యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడుకుని ఉంటుందని టాక్.
