Nithya Menen : ఆ మాటలు చాలా అవమానంగా అనిపించేవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల తార నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ‘అలా మొదలైంది’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. .. ‘ఇష్క్’ మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అందరి హీరోయిన్స్‌లా కాకుండా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు దూరంగా ఉంటూ, మంచి పాత్రలు ఎంచుకుంటూ దాదాపు అన్ని భాషల్లో తన నటనతో మెప్పించింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఈ నిత్య మిగత భాషలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రజంట్ తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ‘ఇడ్లీ కడై’ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నిత్య ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను ఎదురుకున్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది..
Also read: Alia : అలియా నిర్మాణంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరి..
Also Read
- Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
మనకు తెలిసి నిత్య బిగినింగ్ సినిమాలకంటే ఇప్పుడు చాలా బొద్దుగా తయారైంది. నార్మల్‌గా హీరోయిన్లు అంటే జీరో సైజ్ కోసం తపత్రయ పడతారు. దాని కోసం రాత్రింబవళ్లు జిమ్‌లో నానా తంటాలు పడుతుంటారు. కడుపు కట్టుకొని డైటింగ్లు గట్ర చేస్తుంటారు. కానీ నిత్య మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.. ‘మీ జుట్టు ఏంటీ చాలా వింతగా ఉంది. మీరు చాలా పొట్టిగా, లావుగా, మీ కనుబొమ్మలు పెద్దగా ఉన్నాయి.. ఇలాంటి మాటలు నాకు చాలా ఎదురయ్యాయి. అవమానంగా అనిపించాయి. ఈ మాటలు నన్ను చాలా ప్రభావితం చేస్తుంటాయి. కానీ నిజానికి ప్రభావితం చేయాలి కూడా. ఎందుకంటే అప్పుడే మీరు ఆ సవాళ్లను ఎదుర్కొగలరు. కానీ ఎన్ని విమర్శలు ఎదురైనా ఎప్పుడూ నా రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించలేదు. నాలాగే ఉండి నేనెంటో నిరూపించుకోవాలనుకున్నా నా దృష్టిలో శారీరక రూపాన్ని బట్టి మనుషుల్ని అంచనా వేయడమనేది సరియైన ఆలోచన కాదు’ అని చెప్పుకొచ్చింది నిత్య.
- Tags
- Danush
- Idly Kadai
- Nithya Menen
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!