Site icon NTV Telugu

Nithya Menen : ఆ మాటలు చాలా అవమానంగా అనిపించేవి..

Nithya

Nithya

అందాల తార నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో  ‘అలా మొదలైంది’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. .. ‘ఇష్క్’ మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అందరి హీరోయిన్స్‌లా కాకుండా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు దూరంగా ఉంటూ, మంచి పాత్రలు ఎంచుకుంటూ దాదాపు అన్ని భాషల్లో తన నటనతో మెప్పించింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఈ నిత్య మిగత భాషలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రజంట్ తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ‘ఇడ్లీ కడై’ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నిత్య ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను ఎదురుకున్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది..

Also read: Alia : అలియా నిర్మాణంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరి..

మనకు తెలిసి నిత్య బిగినింగ్ సినిమాలకంటే ఇప్పుడు చాలా బొద్దుగా తయారైంది. నార్మల్‌గా హీరోయిన్‌లు అంటే జీరో సైజ్ కోసం తపత్రయ పడతారు. దాని కోసం రాత్రింబవళ్లు జిమ్‌లో నానా తంటాలు పడుతుంటారు. కడుపు కట్టుకొని డైటింగ్‌లు గట్ర చేస్తుంటారు. కానీ నిత్య మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.. ‘మీ జుట్టు ఏంటీ చాలా వింతగా ఉంది. మీరు చాలా పొట్టిగా, లావుగా, మీ కనుబొమ్మలు పెద్దగా ఉన్నాయి.. ఇలాంటి మాటలు నాకు చాలా ఎదురయ్యాయి. అవమానంగా అనిపించాయి. ఈ మాటలు నన్ను చాలా ప్రభావితం చేస్తుంటాయి. కానీ నిజానికి ప్రభావితం చేయాలి కూడా. ఎందుకంటే అప్పుడే మీరు ఆ సవాళ్లను ఎదుర్కొగలరు. కానీ ఎన్ని విమర్శలు ఎదురైనా ఎప్పుడూ నా రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించలేదు. నాలాగే ఉండి నేనెంటో నిరూపించుకోవాలనుకున్నా నా దృష్టిలో శారీరక రూపాన్ని బట్టి మనుషుల్ని అంచనా వేయడమనేది సరియైన ఆలోచన కాదు’ అని చెప్పుకొచ్చింది నిత్య.

Exit mobile version