Site icon NTV Telugu

Nithya Menen : తమిళంలో మరో హిట్ కొట్టేసిన నిత్యామీనన్.. నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్

Nitya

Nitya

ఫ్యామిలీ ఎంట్టరైనర్ తలైవన్ తలైవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు విజయ్ సేతుపతి, నిత్యామీనన్. ఈ మూవీకి ముందు ఈ ఇద్దరు ప్లాప్స్ చూశారు. మక్కల్ సెల్వన్ ఏస్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇక నిత్యామీనన్ సంక్రాంతి బరిలో సందడి చేసింది. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన తిరుచిత్రాంబలం తర్వాత దాదాపు టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న నిత్యా జయం రవితో కలిసి కాదలిక్క నేరమిల్లేలో నటించింది. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది.

Also Read : Mega Star : చిరు – బాబీ సినిమాకు డీఓపీగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు

అప్పుడు మిస్సైన లెక్కలు.. తలైవన్ తలైవీతో సరి చేసుకుంది నిత్యా. జులై 25న తమిళంలో మాత్రమే రిలీజైన తలైవన్ తలైవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే తమిళ్ లో రూ. 30కోట్లను కలెక్ట్ చేసి సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆగస్టు1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో కనిపించలేదు నిత్యా. డబ్బింగ్ సినిమాలతోనే అప్పుడప్పుడు పల్కరిస్తోంది. ఇప్పుడు తలైవన్ తలైవీ సినిమాను సార్ మేడమ్ పేరుతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తుంది.  ఇక నెక్ట్స్ బిగ్ టార్గెట్ దసరాకు ఫిక్స్ చేసింది ఈ మలయాళ కుట్టీ. ధనుష్‌తో మరోసారి కలిసి బాక్సాఫీసును దోచుకోవాలని గట్టిగానే ట్రై చేస్తోంది. ఇడ్లీ కడాయ్ అనే మరో డ్రామా ఫిల్మ్‌తో రాబోతోంది నిత్యా. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయినా ఫస్ట్ లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  లాస్ట్ ఇయర్ ఎనౌన్స్ చేసిన రామ్ కామ్ మూవీ డియర్ ఎక్సెస్ మూవి ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చింది నిత్యా

Exit mobile version