టాలివుడ్ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, లయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. జూలై 4న విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆకట్టుకోగా, రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.. సినిమా అంతా కూడా అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ తో కొనసాగుతుందని, ప్రమాదాల నుంచి అక్కను కాపాడేందుకు తమ్ముడు ఏమైనా చేయగలడు అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా స్టోరీ ఉండనుందని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : Star Heroine: సీన్ కోసం 15 మంది పురుషుల ముందు నగ్నంగా నిలబడ్డాను..
అయితే మామూలుగా ఏ సినిమాకి అయినా పాటలు, టీజర్ లాంటివి వచ్చాక ట్రైలర్ వస్తుంది కానీ ఈ సినిమాకి ట్రైలర్ తర్వాత ఫస్ట్ సింగిల్ రాబోతుంది. కాగా ఫస్ట్ సాంగ్ ఈ జూన్ 17న సాయంత్రం 5 గంటలకి విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేసేసారు మూవీ టీం. ‘భూ అంటూ భూతం’ అంటూ ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ 17 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా ఈ పాటకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
