Site icon NTV Telugu

డేర్ చేస్తున్న నితిన్… మళ్ళీ షూటింగ్ కు రెడీ…!

Nithiin‘s Maestro canecommenced its final shoot schedule Today in Hyderabad

యంగ్ హీరో నితిన్ కరోనా సమయంలోనూ డేర్ చేస్తున్నాడు. షూటింగ్ కు రెడీ అంటున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటిస్తోంది. ఈ చిత్రంలో జిష్షుసేన్‌ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫైనల్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు మేకర్స్. కరోనా కారణంగా గత రెండు నెలలుగా సినిమాల షూటింగ్‌లు జరగడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా కష్ట పరిస్థితుల కారణంగా చాలా సినిమాల థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. ఈ పరిస్థితులలో హీరో నితిన్ కరోనాకు వ్యతిరేకంగా ధైర్యం చేసి షూటింగ్ ను రీస్టార్ట్ చేయడం విశేషం.

Exit mobile version