టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రెడ్డి కరోనా సమయంలో తన చిరకాల ప్రియురాలు షాలిని కందుకూరిని పెళ్లి చేసుకున్నారు. గతేడాది జూలై 26న కరోనా కారణంగా కొద్దిమంది అత్యంత్య సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. నేటితో వారు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయ్యింది. తాజాగా నితిన్ సోషల్ మీడియా ద్వారా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు. తాను భార్య షాలినితో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేస్తూ “ఒకరికి వార్షికోత్సవ శుభాకాంక్షలు… వారితో నేను నా జీవితాంతం గడపాలని కోరుకుంటున్నాను… నా జీవితాన్ని సులభతరం చేసినందుకు, అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు” అంటూ భార్యపై ప్రేమను వ్యక్తపరిచారు.
Read Also : గుణశేఖర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రముఖ యాంకర్
ఈ పిక్ లో నితిన్ తన భార్యను కౌగిలించుకుని, ముద్దు పెడుతున్నాడు. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా ఈ జంట నాలుగు సంవత్సరాల రిలేషన్ తరువాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. నితిన్ ప్రస్తుతం “అంధాదున్” తెలుగు రీమేక్ “మాస్ట్రో”లో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తుండగా… తమన్నా భాటియా, నభా నటేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.