శ్రీరామనవమి సందర్భంగా నితిన్ అభిమానులకు శుభాకాంక్షలు అందచేస్తూ, ‘మాస్ట్రో’ మూవీ టీమ్ ఈ రోజు ఉదయం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. స్కూటర్ పై నితిన్ ను ఎక్కించుకుని, నభానటేష్ డ్రైవ్ చేస్తున్న ఆ ఫోటో చూసి, చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. పండగ సందర్భంగా ఇలాంటి గ్లామర్ పోస్టర్ విడుదల చేశారంటీ అనే చర్చ కూడా సాగింది. ఇదిలా ఉంటే… ఈ పోస్టర్ లో డ్రైవింగ్ చేస్తున్న నభాతో, నితిన్ సైతం హెల్మెట్ పెట్టుకోవడం విశేషం. ఇప్పుడు వెనక కూర్చున్న వారు సైతం హెల్మెట్ పెట్టుకోవాలనే కొత్త రూల్ వచ్చింది కాబట్టి కొందరు భేషన్నారు. కానీ చిత్రంగా ఈ చిత్ర బృందం సాయంత్రం ఈ పోస్టర్ నే కాస్తంత మార్చి విడుదల చేసింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు స్థానంలో ‘వేర్ ఏ మాస్క్ స్టే సేఫ్’ అని ప్రచురించింది. దీనిని చూసి నెటిజన్లు చిత్ర దర్శక నిర్మాతలను అభినందిస్తున్నారు. హిందీ చిత్రం ‘అంధాధూన్’ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ‘మాస్ట్రో’ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు.
మాస్క్ పెట్టిన నితిన్, నభా!
