Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ

Nikhil Siddhartha, Swayambhu Movie, Swayambhu Vfx Record,

Nikhil Siddhartha, Swayambhu Movie, Swayambhu Vfx Record,

యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టిజియస్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్ వైడ్‌గా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్.. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మరో విజువల్ వండర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పరంగా టాలీవుడ్‌లో ఒక నయా రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లు అధికారికంగా వెల్లడించింది.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ సినిమాలో నివేదా థామస్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక లెజెండరీ వారియర్ (యోధుడు) కథగా వస్తున్న ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్నాయని, అందుకోసం భారీ ఎత్తున సీజీ (CG) వర్క్ జరుగుతోందని తాజా అప్‌డేట్ ద్వారా స్పష్టమైంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాల తర్వాత అత్యధిక గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న చిత్రాల జాబితాలో ‘స్వయంభూ’ కూడా చేరిపోయింది. అంతే కాదు ఈ సినిమాలో ఏకంగా 2,700కు పైగా VFX (గ్రాఫిక్స్) షాట్స్ ఉండబోతున్నాయి. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో గ్రాఫిక్స్ ప్లాన్ చేయడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి అని చెప్పాలి. కాగా హాలీవుడ్ రేంజ్ ఔట్‌పుట్‌ను స్క్రీన్‌పై ప్రెసెంట్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ టాప్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలకు చెందిన దాదాపు 750 మందికి పైగా సీజీ ఆర్టిస్టులు రాత్రింబవళ్లు షిఫ్టుల వారీగా నాన్-స్టాప్‌గా శ్రమిస్తున్నారు.

యుద్ధ సన్నివేశాలు, పురాతన సామ్రాజ్యాల సెట్స్, నిఖిల్ వారియర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని మేకర్స్ హామి ఇస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి యుద్ధ విద్యలలో కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. రవి బస్రూర్ (KGF ఫేమ్) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ ఏడాది చివర్లో ఈ విజువల్ ఎపిక్‌ను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.