Site icon NTV Telugu

Nikhil : సినిమా కన్నా స్నాక్స్ ఖరీదు ఎక్కువ.. మల్టీప్లెక్స్ దందా పై నిఖిల్ కౌంటర్

Nikhil Siddhartha

Nikhil Siddhartha

తెలుగు యంగ్ హీరో నిఖిల్ మల్టీప్లెక్స్‌లలో క్యాంటీన్ల దోపిడీపై గట్టిగా స్పందించాడు. తాజాగా ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన నిఖిల్, తనకు సినిమా టికెట్ కన్నా ఎక్కువ ఖర్చు పాప్‌కార్న్, వాటర్ బాటిల్, స్నాక్స్‌కి అయ్యిందని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో టికెట్ ధర రూ.295 ఉంటే, పాప్‌కార్న్ ప్రారంభ ధర రూ.300 నుంచి రూ.900 వరకు ఉండటం, వాటర్ బాటిల్ రూ.100కి అమ్ముతున్నారు. దీనివల్ల మధ్య తరగతి కుటుంబాలు థియేటర్‌కి దూరమవుతున్నాయి. పిల్లల కోసం తినుబండారాలు తప్పనిసరిగా కొనాల్సి వస్తోంది. ఫలితంగా తల్లిదండ్రులు ఖర్చుపై భయపడి సినిమాకు వెళ్లడం తగ్గిస్తున్నారు. వంద శాతం ప్రేక్షకులు థియెటర్‌కు రాకపోడానికి ఇది ముఖ్య కారణం అని చెప్పోచ్చు.. అయితే

Also Read : Kingdom : ‘కింగ్డమ్’ ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది – జూలై 25న భారీ ట్రీట్!

నిఖిల్ ట్వీట్‌తో ఈ సమస్యపై మళ్లీ చర్చ మొదలైంది. ఇండస్ట్రీ పెద్దలు టికెట్ ధరలపై మాత్రమే కాదు, క్యాంటీన్ రేట్లపై నా దృష్టి పెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు, మిడిల్ రేంజ్ మూవీస్‌కు ఇది పెద్ద ఇబ్బందిగా మారుతోంది. కార్పొరేట్ ముసుగులో స్నాక్స్ రేట్ల దందా సాగితే, థియేటర్లకు జనాల రాకా తగ్గిపోతుందని, మల్టీప్లెక్స్ లాభాలు తక్కువవుతాయని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, నిఖిల్ ఇచ్చిన ఈ కౌంటర్ సినిమా పై మాత్రమే కాకుండా, ఆడియన్స్ ఖర్చులపై నా చర్చ అవసరమని స్పష్టం చేసింది.

Exit mobile version