Site icon NTV Telugu

Nikhil Siddhartha : ‘స్వయంభూ’ నుండి అద్భుతమైన పోస్టర్ రిలీజ్..

Nikhil Siddhartha, ‘swayambhu’,

Nikhil Siddhartha, ‘swayambhu’,

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రస్తుతం ఆయన రెండు హిస్టారికల్ బేస్డ్ ఫిలిమ్స్ లైన్‌లో పెట్టాడు. ఇందులో ‘స్వయంభూ’ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌ పతాకం మీద భువన్, శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read : Narne Nithin : నార్నే నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’ ట్రైల‌ర్ రిలీజ్..

ఇందులో సుందర వల్లిగా రాయల్ ప్రిన్సెన్స్ రోల్ చేస్తున్నారు నభా నటేష్. సంయుక్త సైతం ఇప్పటి వరకు చూడనటువంటి కొత్త పాత్రలో కనిపించనుంది. ఇక నేడు జూన్ 1న నిఖిల్ సిద్ధార్థ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మేకర్స్.. ‘స్వయంభూ’ నుండి అద్భుతమైన పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నిఖిల్ కత్తి పట్టుకుని, సంయుక్త విల్లు బాణం పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించే అద్భుతమైన పోస్టర్‌ ను మేకర్స్ ఆవిష్కరించారు. కాగా ప్రజంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

 

Exit mobile version