Saarangadariya Trailer: మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌ల కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil Launches Raja Raveendar Starrer ‘Saarangadariya’ Trailer : రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘సారంగదరియా’. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న క్రమంలో ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ కట్ చూస్తే ‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.., ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది..
Darshan: దర్శన్ కు తొలగని కష్టాలు.. అప్పటి దాకా జైల్లోనే?
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ సినిమాలోని కథ, పాత్రల లోతుని చూపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ కష్టాలను చూపించినట్టుగా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో రాజా రవీంద్ర నటనను చూస్తే అందరినీ కదిలించేలా ఉంది. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, గొప్ప ఉపాధ్యాయుడిగా కనిపించినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే పాటలు, ఆర్ఆర్ కూడా బాగున్నాయి. వినయ్ రాసిన డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. రాజా రవీంద్ర తో కలిసి శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!