Site icon NTV Telugu

Nikamma Movie: ఇక్కడే హిట్ కాలే.. అక్క‌డ‌వుతుంద‌ని ఎలాఅనుకున్నారు..?

Nikamm

Nikamm

తెలుగు లో స‌క్సెస్ అయిన సినామా క‌థ‌లు బాలీవుడ్ లో రీమేక్ చేయడం.. దాన్ని స‌క్సెస్ కొట్ట‌డం.. ఇది చాలా కాలంగా వ‌స్తున్న ఆన‌వాయితీ.. అందుకే అవి త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతాయి. అయితే ఆ సినిమాల‌పై ఖ‌ర్చుకు ఏమాత్రం వెన‌కాడ‌కుండా భారీగానే ప్ర‌మోట్ చేసి మ‌రీ విడుద‌ల చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో అలాంటి సినిమాలకు అంతగా కలిసి రావడం లేదు. నాని జెర్సీ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జెర్సీ సినిమా చాలా మంచి సినిమా అయినప్పటికీ కూడా కమర్షియల్గా మాత్రం తెలుగులోనే అంతగా ఆడలేదు. ఇక హిందీ రీమేక్ కు అయితే కనీసం పెట్టిన పెట్టుబడిలో 10% కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ఇప్పుడు నాని చేసిన మరొక రీమేక్ కథ కూడా బాలీవుడ్ దగ్గర బోల్తా కొట్టింది. ఒక విధంగా అవసరం లేని రీమేక్ చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుని పరిస్థితి ఏర్పడిందనే చెప్పవచ్చు. ప్రముఖ దర్శక నిర్మాత అహ్మద్ ఖాన్ తెరపైకి తీసుకువచ్చిన ‘నికమ్మ’ MCA కు రీమేక్ గా తెరకెక్కింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతగానో ప్రమోట్ చేశారు. అభిమన్యు దాసాని కథానాయకుడిగా ‘ షెర్లీ సెటియా హీరోయిన్ గా చేయగా తెలుగులో భూమిక చేసిన క్యారెక్టర్ని శిల్పా శెట్టి చేశారు.

ఈ శుక్రవారం గ్రాండ్ గానే రిలీజ్ చేయగా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. మొదటిరోజు ఈ సినిమాకు కేవలం 25 లక్షలు కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు నాని ఎంసీఏ సినిమా వీళ్ళు ఎందుకు రీమేక్ చేశారు అనేది పెద్ద డౌట్. ఎంసీఏ సినిమా తెలుగులోనే పెద్ద గా చెప్పుకునెంత సక్సెస్ ఏమీ కాలేదు. పక్కా కమర్షియల్ రొటీన్ ఫార్మాట్ లోనే ఆ సినిమాను తెరపైకి తీసుకువచ్చారు. కేవలం నాని సాయి పల్లవి వరుస విజయాలు నుంచి వచ్చిన క్రేజ్ ద్వారానే ఆ సినిమా అలా ఆడేసింది.

అయితే అలాంటి సినిమాను హిందీలో ఎందుకు రీమేక్ చేశారు అనేది పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. సక్సెసైన కథలే అంతంతమాత్రంగా ఆడుతుంటే ఇక ఏదో యావరేజ్ గా ఆడిన ఎంసీఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా రిజల్ట్ నేను తెలుగు వాళ్ళు ముందే ఊహించారు. కానీ అనవసరంగా దర్శకనిర్మాత గుడ్డిగా నమ్మి డబ్బు టైమ్ రెండు వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది.

Reactor Blast: వెలిమినేడులో పేలిన రియాక్టర్.. భారీగా వెలువడిన విషవాయువులు

Exit mobile version