Site icon NTV Telugu

Niharika : విడాకుల నొప్పి నాకు మాత్రమే తెలుసు – నిహారిక ఓపెన్ టాక్

Niharika

Niharika

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఎంత గ్రాండ్‌గా జరిగిందో మనకు తెలిసిందే. కానీ ఆ ఆనంది ఎక్కువ కాలం లేదు.. కొన్ని రోజుల పాటు సంతోషంగా దాంపత్య జీవితం గడిపిన కానీ అనూహ్య కారణాల వల్ల ఈ జంట విడాకులు తీసుకుంది. విడాకుల వెనుక అసలు కారణాలు బయటకు రాలేదు. అయితే నిహారిక మాత్రం మళ్లీ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ప్రయత్నం చేస్తూ, తన ఇంటి నుంచి బయటపడకుండా స్వతంత్రంగా నిలబడే దిశగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో నిర్మాతగా మారిన నిహారిక ‘కమిటీ కుర్రాళ్లు’ అనే సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే ఇటీవల ఆమె గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడాకుల గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యాయి.

Also Read : Vijay Devarakonda : ఆ విషయంలో మాత్రం ఆనంద్‌కి సపోర్ట్ చేయను..

నిహారిక మాట్లాడుతూ .. “నాది లవ్ మ్యారేజ్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం మీకేం తెలుసు. నేను ఎందుకు విడిపోయాను అన్నది నా వ్యక్తిగత విషయం. నాకు తగిలిన దెబ్బకు నొప్పి నాకు మాత్రమే తెలుసు. మా నాన్న ఎప్పుడూ నన్ను భారం లాగా భావించలేదు. ఒక బాధ్యతగా చూసుకున్నారు. ఆయన వయసు 65 అయి ఉండొచ్చు కానీ, ఆలోచనలో మాత్రం ఈ జనరెషన్‌ది. ‘నీకు 60 ఏళ్లు వచ్చినా నేను చూస్తా, వచ్చేయ్ మన ఇంటికి’ అన్నారు. మా నాన్నతో పాటు నా అన్నయ్య కూడా నాకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతులు” అంటూ భావోద్వేగంతో స్పందించింది. ఈ ఇంటర్వ్యూకు నెటిజన్స్ స్పందిస్తూ.. “మీ నాన్న సంతోషంగా ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన లోపల ఎంత బాధ పడుతున్నారో ఆయనకు మాత్రమే తెలుసు. తండ్రి బాధను ఎవరూ అంచనా వేయలేరు” అంటూ స్పందిస్తున్నారు. నిహారిక చెప్పిన ఈ మాటలు మానవ సంబంధాల్లోని నిశ్శబ్ద బాధను, అండగా ఉండే కుటుంబ మద్దతును అందరికీ గుర్తుచేస్తున్నాయి.

Exit mobile version