Site icon NTV Telugu

Niharika : కొణిదెల క్లింకార, రామ్ చరణ్ లపై నిహారిక ఆసక్తికర కామెంట్స్.

Untitled Design (30)

Untitled Design (30)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిన విషయమే. తమ ఇంటి అదృష్టానికి క్లీంకార అని నామకరణం చేశారు మెగా దంపతులు.కానీ ఇప్పటి వరకు క్లీంకార ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. కొన్ని ఫోటోలు వచ్చిన వాటిలో ఎక్కడా కూడా పేస్ రివీల్ చేయలేదు. తమ అభిమాన హీరో ముద్దుల తనయను చూడాలని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు.

Also Read: Venkatesh: భార్య ఉండగా ప్రియురాలుతో వెంకీ మామ పోరాటం.. మ్యాటర్ ఏంటంటే..?

కాగా క్లీంకార అలాగే రామ్ చరణ్ పై నాగబాబు తనయ నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నిహారిక నిర్మాతగా అందరూ కొత్త వారితో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రానుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఇంటర్వూ లో మాట్లాడుతూ ” మా ఫామిలీలో ఇప్పుడు అందరి అటెన్షన్ క్లీంకారపైనే. క్లీంకార ముద్దుగా మాట్లూడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మా చరణ్ అన్నని ముప్పుతిప్పలు పెడుతోంది. ఫుడ్ పెట్టడానికి మా అన్న ఎన్నో సాహసాలు చేయాలి, కుక్క పిల్లను చూపించి అటు ఇటు తిప్పుతూ చరణ్ అన్నని పరిగెత్తిస్తుంది. చరణ్ అన్నకి క్లీంకార అంటే ప్రాణం. నేను ప్రత్యక్షంగా చుసిన వాళ్లలో చరణ్ బెస్ట్ నాన్న. ఎటువంటి టెన్సన్స్ పెట్టుకోకుండా తన కూతురిని అల్లారు ముద్దుగా చరణ్ చూసుకుంటాడు. రామ్ చరణ్ నటించిన సినిమా ఆస్కార్ గెలవడం అలాగే పవన్ కళ్యాణ్ బాబాయ్ ఎమ్మెల్యేగా గెలవడం క్లీంకార వచ్చాకే జరిగాయి. మా ఇంటికి, మా అందరికి  క్లీంకార లక్కీ డార్లింగ్” అని నిహారిక అన్నారు.

Exit mobile version