Site icon NTV Telugu

రెయిన్ సాంగ్ కు నో అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nidhi Agarwal says no to Rain Songs

సౌత్ లో అత్యంత తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరు. 2018లో విడుదలైన నాగ చైతన్య “సవ్యసాచి”తో ఎంట్రీ ఇచ్చిన నిధి మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి కొన్ని టాలీవుడ్ సినిమాల్లో నటించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం ద్వారా ఆమెకు మంచి క్రేజ్ దక్కింది. ఇందులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ రెయిన్ డాన్స్ గురించి మాట్లాడారు. స్పెషల్ సాంగ్ లో రెయిన్ డాన్స్ చేయడంపై ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు.

Read Also : మెగా హీరో సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ ?

ఆమె మాట్లాడుతూ “వర్షంలో సాంగ్ ను చిత్రీకరించడం అంత సులభం కాదు. షాట్ సమయంలో తడిపోవడం, షాట్ శ్యాప్ లో ఎండబెట్టుకోవడం, మళ్ళీ తడవడం చాలా కష్టమైన పని. అంతేకాదు వర్షం పడుతున్నప్పుడు కళ్ళను తెరిచి ఉంచడం ఇంకా కష్టం. నా వరకు నేను రెయిన్ డ్యాన్స్ చేయాలనీ అనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కిట్టిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా “హరి హర వీర మల్లు”లో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తొలి చిత్రం “హీరో”లో కూడా నిధి నటిస్తోంది.

Exit mobile version