NTV Telugu Site icon

Betting App Promotions: చిక్కుల్లో మరో హీరోయిన్?

Nidhi

Nidhi

గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఒక యూట్యూబర్‌తో కలిసి వీసీ సజ్జనర్ చేసిన ఒక ఇంటర్వ్యూ తర్వాత వరుసగా వారందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, టేస్టీ తేజ, విష్ణు ప్రియ సహా మొత్తం 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇక నటి, హీరోయిన్ మంచు లక్ష్మి కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిందని, ఆమె మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

MLA Rajagopal Reddy: కేసీఆర్ చేసిన మంచి పని ఇది..

ఇదే సమయంలో, ఒక స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా గతంలో ఒక బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో, “మిగతా వారందరికీ ఒక లెక్క, ఈమెకు ఒక లెక్కా?” అంటూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆమె మీద సైతం కేసులు నమోదు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.