Site icon NTV Telugu

Nidhhi Agerwal: తెలుగు హీరోయిన్‌కి ప్రభుత్వ వాహనం.. అసలు నిజం ఇదే!

Nidhhi Agerwal Ap Governmen

Nidhhi Agerwal Ap Governmen

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనం నిధి అగర్వాల్ పర్యటనకు వినియోగించారంటూ మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక లేఖను ఆమె విడుదల చేశారు. తాను ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ లాంచ్ ఈవెంట్‌కి వెళ్లానని, అక్కడ తన కారు గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ ఈవెంట్‌కి హాజరైన సమయంలో అక్కడి లోకల్ ఆర్గనైజర్లే తనకు ట్రాన్స్‌పోర్టేషన్ కల్పించారని చెప్పుకొచ్చింది.

Also Read:Bigg Boss 9: బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’.. తట్టుకుంటారా ?

అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వాహనం అయి ఉండవచ్చు, కానీ నేను ఆ వాహనం నాకు ప్రొవైడ్ చేయమని అడగలేదు. అక్కడి ఈవెంట్ ఆర్గనైజర్లే నాకు ఆ వాహనాన్ని సమకూర్చడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఆ వాహనాన్ని పంపించారని కొన్ని పోర్టల్స్‌లో నేను చదివాను. నేను ఆ విషయాన్ని చాలా క్లియర్‌గా ఖండిస్తున్నాను. ఈ ఆరోపణలన్నీ నిజం కావు, నిరాధారమైనవి. ఏ ప్రభుత్వ అధికారికి ఈ విషయంతో సంబంధం లేదు. నేను నా అభిమానులకు అసలు నిజం చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ విషయాన్ని క్లారిఫై చేస్తున్నాను. నాకు నా అభిమానులు చూపిస్తున్న ప్రేమకు, సపోర్ట్‌కి నేనెప్పుడూ కృతజ్ఞురాలిని అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version