NTV Telugu Site icon

Nidhhi Agerwal: ఒకే రోజు.. రెండు రాష్ట్రాల్లో రెండు సినిమాల షూట్!

హిందీలో మున్నా మైఖేల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్ తర్వాత తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసినా అది కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.. అయితే ఇస్మార్ట్ శంకర్ మాత్రం సూపర్ హిట్ అయింది. కానీ అందులో ఆమె పాత్ర చిన్నది కావడంతో అనకు పెద్దగా అవకాశాలు మళ్ళీ రాలేదు తర్వాత హీరో అనే సినిమా చేసింది ఆ సినిమా హిట్ అయినా సరే ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు అని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమెకు పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు అనే సినిమాలో నటించే అవకాశంతో పాటు ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది.

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్‌ని అప్పగించాలని కోరాం, కెనడా స్పందించలేదు: భారత్..

ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలతో ఆమె బిజీ బిజీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. కళాకారుల లైఫ్ అనేది సర్ప్రైజ్లతో నిండి ఉంటుందని చెప్పుకొచ్చింది. కొన్ని సర్ప్రైజ్లు మాత్రం ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటేనే జరుగుతాయి అని పేర్కొంది. ఆమె తాజాగా ఒకేరోజు రెండు పాన్ ఇండియా సినిమాలు రెండు రాష్ట్రాలలో షూటింగ్ చేయడం ఆనందంగా ఉందని చెప్పకొచ్చింది. మేమేం చేసామో మీరు చూడటం కోసం నేను ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను అది ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుందంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీనికి రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్పందిస్తూ మంచి డెడికేషన్, బెస్ట్ విషెస్ అంటూ కామెంట్ చేయగా దానికి థాంక్యూ సర్ అంటూ ఆమె రిప్లై ఇచ్చింది. ప్రస్తుతానికి ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments