టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఆమె విచారణ ముగిసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో అధికారులు ఆమెను దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రముఖ బెట్టింగ్ యాప్ ‘జీత్ విన్’ (JeetWin) సహా పలు వివాదాస్పద ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, ప్రమోషనల్ యాడ్స్‌లో నటించడంపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
qఈ ప్రచారాల కోసం సదరు యాప్ నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందాలు (కాంట్రాక్ట్‌లు), తీసుకున్న రెమ్యునరేషన్ లావాదేవీలపై అధికారులు లోతుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిధుల బదిలీ ఏ మార్గాల ద్వారా జరిగిందనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ విచారణ అనంతరం నిధి అగర్వాల్ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా, మాట్లాడేందుకు నిరాకరిస్తూ ఆమె నేరుగా తన కారులో అక్కడి నుంచి వెనుదిరిగారు. సినీ తారలు బాధ్యతారహితంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్న వేళ, నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరుకావడం టాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.

