NTV Telugu Site icon

NaveenPolishetty: సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న నవీన్‌ పొలిశెట్టి వీడియో.. వీడియోలో ఏముందంటే..

Untitled Design (38)

Untitled Design (38)

యంగ్ సెన్షేషన్ నవీన్‌ పొలిశెట్టికి యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. గతంలో పలు చిత్రాలలో సహానటుడిగా నటించిన అవేవి మనోకి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.దీంతో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా మారాడు ఈ టాలెంటెడ్ కుర్రోడు. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. స్పాంటేనియస్ పంచులతో ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించాడు. ఇక తరువాత చేసిన జాతిరత్నాలు చిత్రం నవీన్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. యూత్ లో మనోడి క్రేజ్ ను వేరే లెవల్ కు తీసుకు వెళ్ళింది.

Also Read : Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..

కాగా అనుష్క హీరోగా నవీన్ హీరోగా వచ్చిన చిత్రం మిస్ .శెట్టి మిస్టర్ పోలిశెట్టి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధించింది. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ చిత్రం తర్వాత మరోక సినిమా స్టార్ట్ చేయలేదు ఈ యంగ్. దింతో అనేక అనుమానాలు వచ్చాయి. వాటన్నిటికి చెక్ పెడుతూ ఇటీవల నవీన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అమెరికాలో నివాసం ఉంటున్న నవీన్ కు ఆక్సిడెంట్ జరిగి కుడి చేతికి గాయమైనట్టు తెలిపాడు. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసాడు కుర్ర హీరో. చేతికి గాయం అయి తాపీగా కూర్చుని టీవీ చూస్తుండగా సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ డైలాగ్ రావడంతో చేతుల మీద డైలాగ్ లేని ఛానెల్ పెట్టమంటే క్రికెట్ అంపైర్ రెండు చేతులు పైకి చెప్పడంతో టీవీ ఆఫ్ చేయమనడం, గాన కోకిలకు చప్పట్లు కొట్టమంటే చెంపతో కొడుతూ, తినేందుకు కూడా చేతులు లేకుండా ఇబ్బంది పడడం వంటి సన్నివేశాలతో ఆద్యంతం అలరించాడు చివరలో మిమ్మల్ని నవ్వించడం నాకు చాలా ఇష్టం, త్వరలోనే బిగ్ స్క్రీన్ పై కలుస్తానని సందేశం తెలియజేసాడు నవీన్‌ పొలిశెట్టి.

Show comments