NTV Telugu Site icon

ZEBRA : లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జీబ్రా’

Zeebra

Zeebra

క్యారక్టర్ ఆర్టిస్టు గా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్. తాజగా  సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయ  కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం మరియు దినేష్ సుందరం నిర్మించారు. ఈ రోజు, మేకర్స్ ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఉద్దేశించిన మోషన్ పోస్టర్‌ విడుదల చేసారు.

Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ సినిమా స్టార్ట్..

వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 31న అన్ని దక్షిణ భారత భాషల్లో మరియు హిందీలో థియేటర్లలోకి రానుందని గతంలో వెల్లడించారు. ఈ దీపావళికి రిలీజ్ కానున్న ఈ సినిమా తప్పక అలరిస్తుందని యూనిట్ భావించింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా దీపావళి రేస్ నుండి తప్పుకుంది. అయితే నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాను నవంబరు 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వరుస ఫ్లోప్స్ కు బ్రేక్ వేసి ఈ దఫా ఎలాగైనా సక్సెస్ ఇస్తుందని ఎంతో ఆశగా, నమ్మకంగా ఉన్నాడు హీరో సత్యదేవ్. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సత్యదేవ్ కు ఎటువంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Show comments