Site icon NTV Telugu

“షేమ్ లెస్ లేడీ” కియారాపై ట్రోలింగ్…!!

Netizens call Kiara Advani 'shameless lady

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హోదాను ఎంజాయ్ చేస్తోంది. హాట్ హాట్ పిక్స్ తో తమ సోషల్ మీడియా ఖాతాలో యూత్ కు సెగలు పుట్టించే ఈ భామ ఇప్పుడు ట్రోలింగ్ బారిన పడింది. సాధారణంగానే సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతమైన క్రేజ్ ను కూడగట్టుకుంటారు సెలెబ్రిటీలు. కానీ ఏదైనా తేడా జరిగితే మాత్రం అదే మాధ్యమం వేదికగా ఉతికి ఆరేస్తారు నెటిజన్లు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాపై కన్నేసి ఉంచే ట్రోలింగ్ రాయుళ్ల వలలో కియారా చిక్కుకుంది. ఇటీవల కియారా కారులోంచి దిగుతున్న ఓ వీడియోను పట్టుకుని “షేమ్ లెస్ లేడీ” అంటూ ట్రోలింగ్ మొదలెట్టేశారు. గత మూడు రోజుల క్రితం ఎవరో షేర్ చేసిన ఈ వీడియోపై ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్ అంతటికీ కారణం ఓ పెద్దాయన.

Read Also : స్టార్ హీరో డైరెక్షన్ లో తలైవా 170వ మూవీ ?

అసలేం జరిగిందంటే… ఇటీవల కియారా ప్రియుడిగా ప్రచారం జరుగుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్ళింది. అయితే ఆమె కారు దిగుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని ఒకరు వీడియో రూపంలో బంధించారు. అక్కడ ఆమె కారు దిగుతుండగా… సెక్యూరిటీగా ఉన్న ఉన్న ఓ పెద్దాయన ఆ కార్ డోర్ ఓపెన్ చేస్తూ కియారాకు నమస్కరించాడు. అయితే కియారా మాత్రం అతడిని చూసీచూడనట్లు అక్కడినుంచి వెళ్ళిపోయింది. దీంతో ఆ ఏజ్ లో ఉన్నాయని నమస్కరించినప్పుడు తిరిగి నమస్కారం చేయాలన్న సంస్కారం కూడా ఆమెకు లేదు అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అయితే ఆమె అభిమానులు మాత్రం ఒక సాధారణమైన ఘటనకు అంత ట్రోలింగ్ అవసరం లేదని ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కియారా త్వరలో టాలీవుడ్ లోనూ కనిపించనుంది. 

Exit mobile version