Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా సినీ తారలను టార్గెట్ చేస్తూ పుట్టుకొస్తున్న ‘డీప్‌ఫేక్’ వీడియోలు ఇండస్ట్రీని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఏఐ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని కొందరు ఆకతాయిలు హీరోయిన్ల ముఖాలతో అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారు. తాజాగా ఈ డీప్‌ఫేక్ మాయాజాలానికి టాలీవుడ్ ‘చిరుత’ బ్యూటీ, బాలీవుడ్ నటి నేహా శర్మ బలయ్యారు. అయితే దీనిపై సైలెంట్ గా బాధపడకుండా, నేహా శర్మ రౌద్రరూపం దాల్చారు. తన వీడియోలు సృష్టిస్తున్న సైబర్ నేరగాళ్ల భరతం పడతానంటూ నెట్టింట సంచలన పోస్ట్ పెట్టారు.
తన అనుమతి లేకుండా తన ముఖాన్ని ఉపయోగించి ఏఐ ద్వారా వీడియోలు, ఫోటోలు సృష్టిస్తున్న వారిపై నేహా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా ఫేస్ వాడి క్రియేట్ చేసిన ఫేక్ కంటెంట్ మొత్తాన్ని వెంటనే డిలీట్ చేయండి. నా పరువుకు భంగం కలిగించేలా ఇలాంటి వీడియోలు సృష్టించడం, వాటిని సర్క్యులేట్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనికి నా సమ్మతి అస్సలు లేదు. తక్షణమే ఆ చెత్తనంతా నెట్టింటి నుంచి తొలగించండి.. ఇదొక ఫార్మల్ వార్నింగ్” అంటూ నేహా శర్మ గట్టిగా హెచ్చరించారు.
“ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా సరే చట్టం నుంచి, శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నా ఐడెంటిటీని వాడుకుని ఇలాంటి ఏఐ వీడియోలు క్రియేట్ చేసినా, ఎడిట్ చేసినా, లేదా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా సరే.. ప్రతి ఒక్కరిపైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఏఐ టెక్నాలజీ, ఫేక్ అకౌంట్లు మిమ్మల్ని కాపాడతాయని భ్రమపడకండి. పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. టేక్ ఇట్ డౌన్ నౌ.. యు హావ్ బీన్ వార్న్డ్ (వెంటనే ఆ వీడియోలు తీసేయండి.. మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది)” అంటూ ఘాటైన పోస్ట్‌తో అల్టిమేటమ్ జారీ చేశారు.
Also Read
తాజావార్తలు
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?