ఈ మధ్యకాలంలో యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఆడియెన్స్ మెప్పు పొందుతున్నాయి. నయా దర్శకనిర్మాతల థాట్స్, ప్రెజెంటేషన్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే బాటలో ‘త్రిబాణధారి బార్భరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతోన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ పెంచగా.. తాజాగా నీవల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘురాం అందించిన లిరిక్స్, సిద్ శ్రీరామ్ సింగింగ్ మేజర్ హైలైట్ అయ్యాయి. సాంగ్ లో కనిపిస్తున్న సీన్స్ యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రానికి ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన మ్యూజిక్-ఆర్ఆర్, కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణ కానుందని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ గ్రాండ్ గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.
Also Read : Laila : లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరు