NBK 111 Update: బాలయ్య సరికొత్త మేకోవర్.. ఈసారి డబిడదిబిడే!

  • 'NBK 111' నుంచి సాలిడ్ అప్‌డేట్
  • మార్చి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్‌
  • భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలు
  • బాలయ్య బాబు సరికొత్త మేకోవర్
Nbk 111 Update, Balakrishna

Nbk 111 Update, Balakrishna

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘NBK 111’ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఒకటి బయటికొచ్చింది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం.. మార్చి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టుగా సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా ఒక అండర్‌వరల్డ్ డాన్‌ పాత్రలో కనిపించబోతున్నారట.

ముంబై మాఫియా నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. అయితే రెండు రోజుల క్రితం బాలయ్యపై ప్రత్యేకంగా లుక్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ లుక్ టెస్ట్‌లో బాలయ్య డిఫరెంట్ గెటప్పులు ట్రై చేశారని, సినిమా కోసం ఆయన సరికొత్త మేకోవర్ కాబోతున్నారని వినికిడి. పాత్ర డిమాండ్ మేరకు కాస్త స్లిమ్‌గా మారాలని దర్శకుడు సూచించడంతో.. బాలయ్య ప్రస్తుతం తన శరీరాకృతిని మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారట. డాన్ పాత్ర కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారట.

Also Read: CJI Surya Kant : న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే.. ప్రజలకు సరైన న్యాయ జరుగుతుంది!

NBK 111 చిత్రంలో అగ్ర కథానాయిక నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమాకు ముందుగా అనుకున్న కథ వేరు. కానీ బడ్జెట్ కారణంగా ఆ కథను పక్కకు పెట్టారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా నయన తారను తీసుకున్నారు. కానీ ఇప్పుడు మారిన కథలో ఆమె ఉండే ఛాన్స్ లేదని అన్నారు. చివరకు అందులో నిజం లేదని తెలిసింది. బాలయ్య-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో.. ఎన్బీకే 111 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.