NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌ డేట్ ఫిక్స్

nbk111

nbk111

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా వెల్లడించనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ ‘GOD’ మరియు ‘DADA’ (దాదా) అనే రెండు మాస్ క్యాచీ టైటిల్స్ చిత్ర బృందం పరిశీలనలో ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.  బాలయ్య ఇమేజ్‌కి, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ డ్రామాకి ఈ రెండు పేర్లు పర్ఫెక్ట్‌గా సరిపోతాయని భావిస్తున్నారు. అయితే దాదాపు ‘దాదా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.  ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్ స్టార్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయపడడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు మేకర్స్. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న వచ్చే అధికారిక ప్రకటనతో ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీపై పూర్తి స్పష్టత రానుంది.