బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు బోయపాటి.
Also Read : JatadharaTeaser : సుధీర్ బాబు ‘జటాధర’ టీజర్ రిలీజ్..
బాలయ్య బర్త్ డే కనుకగా రిలీజ్ చేసిన అఖండ 2 కు టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. అందుకు సంభందించి ఏర్పాట్లు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. తాజాగా చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అఖండ 2 కు సంబందించి డబ్బింగ్ వర్క్ కూడా కంప్లిట్ చేసాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇటీవల అఖండ 2 సెప్టెంబర్ రిలీజ్ ఉండదని పోస్ట్ పోన్ అవుతుందని రకరకాల ఊహాగానాలు వినిపించిన నేపధ్యంలో అలాంటిదేమి లేదని ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కేవచ్చేందుకు అఖండ రెడీ అవుతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.
