Site icon NTV Telugu

Nayanathara : బాలయ్య సినిమాకి బడ్జెట్ దెబ్బ.. నయన్ అవుట్?

Nayanathara

Nayanathara

‘అఖండ తాండవం’ తర్వాత ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతానికి ‘NBK 111’ పేరుతో సంబోధిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదట ఒక హిస్టారికల్ మూవీగా 170 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఓటీటీ (OTT) మార్కెట్ పూర్తిస్థాయిలో పతనం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో, సినిమా బడ్జెట్ అంత పెడితే వర్కౌట్ కాదని భావించి ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి, మరొక మాస్ మసాలా ఎంటర్టైనర్ కథతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బాలయ్యకు గోపీచంద్ మలినేని కథ చెప్పగా, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.

Also Read: Chiranjeevi : చిరంజీవికి స‌ర్జ‌రీ?

ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్న నయనతారను కూడా తప్పించబోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే 170 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పుడు ఈ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకుని ఆమెకు 11 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. అయితే సినిమాని తక్కువలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, నయనతారను తప్పించి మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాలని టీమ్ భావిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 14 రీల్స్ ప్లస్ సంస్థ కూడా తొలుత ‘అఖండ తాండవం’ చేయాలని అనుకోలేదు.

Also Read: God Of War: ఎన్టీఆర్ -బన్నీ’ల దెబ్బ.. సినిమా నిలిపివేసిన త్రివిక్రమ్?

బాలకృష్ణ హీరోగా బోయపాటి కాంబినేషన్‌లో ఒక సింపుల్ పొలిటికల్ డ్రామా చేయాలనుకున్నారు. కానీ చివరికి అది ‘అఖండ తాండవం’గా మారి భారీ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించేలా మారింది. ఈ విషయంలో ముందే మేల్కొన్న NBK 111 నిర్మాణ సంస్థ, సినిమాని సింపుల్‌గా ముగించాలని భావిస్తోంది.

Exit mobile version