NTV Telugu Site icon

NBK 109 : బాలయ్య – బాబీ సినిమా టైటిల్ ఇదే..?

Sarkaer

Sarkaer

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ జరగక జరుగుతుంది ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ముగించిన యూనిట్ తాజాగా హైదరాబాదులోని చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ చెట్ల మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు విలన్ పాత్ర పోషిస్తున్నాడు టైమింగ్స్ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.NBK 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.

Also Read : KA : కిరణ్ అబ్బవరం పడే కష్టానికి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య

దీపావళి కానుకగా ఈ చిత్ర టైటిల్ టీజర్ ను ప్రకతీస్తామని నిర్మాత నాగవంశీ ఇటీవల ప్రకటించాడు.అయితే ఈ చిత్రానికి ‘డాకు మహారాజ్’ ‘వీరమాస్’ ఇలా రకాల పేర్లు టైటిల్ గా వినిపించాయి. కానీ విశ్వసనీయ ప్రకారం ఈ చిత్రానికి ‘సర్కార్ సీతారాం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రేపు టైటిల్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. బాలయ్యను ఇదివరకు ఎన్నడు చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు బాబి. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నాగవంశీ. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది విడుదలైన బాలయ్య ‘భగవంత్ కేసరి’ వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో నటించింది.

Show comments