హీరోయిన్ నజ్రియా గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫహాద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకోన్ని రీసెంట్‌గా ‘సూక్ష్మ దర్శిని’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది నజ్రియా. అయితే ఈ మూవీ పూర్తయిన నాటి నుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. దీంతో ఆమె.. తన భర్త వేరు వేరుగా ఉంటున్నారు.. విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెటింది ఈ ముద్దుగుమ్మ.
Also Read: Tamannaah : గ్లామర్ మీద ఉన్న శ్రద్ధ.. ఎంచుకునే పాత్ర మీద కూడా ఉండాలి..
‘నేను కొంతకాలంగా అందరికీ దూరంగా ఉంటున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంలేదు. నా 30వ పుట్టినరోజు, నా చిత్రం సక్సెస్ మీట్లు.. ఇలా దేనికీ నేను హాజరు కాలేదు. ఎన్నో ముఖ్యమైన క్షణాలు మిస్ అయ్యాను. నా గురించి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నించిన అందరికీ ధన్యవాదాలు. వాళ్ల ఫోన్లకు నేను సమాధానం ఇవ్వలేదు. అంతే కాదు సినిమాల్లో నాకు పాత్ర ఇవ్వడం కోసం ఎంతోమంది ఫోన్ చేశారు. వారి ఫోన్లు కూడా నేను తీయలేదు. ఈ విషయంలో అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఇది నాకు చాలా కఠినమైన సమయం. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాను’ అని చెప్పుకొచ్చింది నజ్రియా.
