దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్‌స్టార్’గా వెలుగొందుతున్న నయనతార.. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా చాలా ప్లానింగ్ గా ఉంటుంది. మూడేళ్ల క్రితం విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సరోగసి ద్వారా కవలలు పుట్టారు. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మరోవైపు కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార. ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఇటు తల్లిగా కుటుంబంతో.. తన కెరీర్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నయన పేరు మీద.. ఇటీవల ఒక తీవ్రమైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Kriti Sanon : ధనుష్ నటనకు ఫిదా అయిన కృతి సనన్ ..
ఆ పోస్టులో కొన్ని కఠినమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినట్టు కనిపిస్తుంది. అయితే ఈ పోస్ట్ లో నయనతార స్వయంగా రాసిందా? లేక ఎవరో కావాలని ఆమె పేరును వాడి వైరల్ చేశారా? అనే విషయంలో పక్క పెడితే.. వైరల్ అవుతున్న వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఆ పోస్టులో ఇలా ఉంది ‘‘ఒక తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు వివాహం ఒక పొరపాటు. మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పురుషులు సాధారణంగా పెద్ద వాళ్ళు కారు. నన్ను ఒంటరిగా వదిలేయడం మంచిది’ అంటూ పోస్ట్ పెట్టింది. కానీ ఇది పెట్టిన కాసెప్పటికే డిలిట్ చేసినప్పటికి..కానీ అంతలోనే అది వైరల్ అయ్యింది. మరి ఇంతకీ ఇది నిజంగా నయనతార రాసినదా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
