Nayantara: సరోగసి ప్రస్తుతం హాట్ టాపిక్. నయనతార, విజ్ఞేశ్ శివన్ దంపతులు తీసిన సినిమాల కంటే కూడా వారికి పుట్టిన పిల్లల గురించే జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. సరోగసి ద్వారా పిల్లలు పుట్టడం అనేది చాలా మంది చేస్తుందే. కాని వీళ్లకు పెళ్లి అయిన నాలుగు నెలలకే పుట్టారు. సాధారణ గర్భం ద్వారా అయితే అది వివాదం ఉండేది కాదు.
Read Also: Indonesia: ఇండోనేషియాలో ఘోరం.. పడవ ప్రమాదంలో 14మంది మృతి
కాని సరోగసి ద్వారానే అనే విషయం బయటకు వచ్చింది. దీనితో ఇద్దరి మీద కేసు నమోదు చేస్తారని జైలు శిక్ష పడుతుందని వార్తలు వచ్చాయి. ఇండియాలో సరోగసి ద్వారా పిల్లలు పుట్టాలి అంటే తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉండాలి. ఉన్నట్టుగా మెడికల్ రిపోర్ట్ కావాలి. అందుకే ఇది వివాదం అయింది. అయితే ఇప్పుడు వీరికి ఎలా పిల్లలు పుట్టారో క్లారిటీ వచ్చేసినట్టు, ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే.. నయనతార, విజ్ఞేశ్ శివన్ దంపతులు పిల్లల వ్యవహారంపై విచారణ పూర్తయింది. వివాదం పై విచారణకు అదేశించారు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్. ఈ విషయంపై ఏర్పాటు చేసిన ముగ్గురు కమిటీ సభ్యులు రేపు తమిళనాడు సర్కారుకు నివేదిక అందించనున్నారు. సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా అన్న విషయంపై కమిటీ విచారణ జరిపింది.
Read Also: Nithin : దివాళీ డబుల్ ఢమాకా.. ఆ హీరో అదృష్టం మామూలుగా లేదుగా
తమిళనాడు ప్రభుత్వానికి నయనతార, విజ్ఞేశ్ ఇటీవల కొన్ని పత్రాలు ఇచ్చారట. తమకు పిల్లలు పుట్టింది దుబాయిలో అని చెప్పారట. తమ ఫ్రెండ్ ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు అయినట్టు చెప్పారట. దీనితో ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోయిందని తెలుస్తోంది. ఇది వివాదం అవుతుందని ముందే తెలుసు అని, అందుకే అన్ని పత్రాలు సిద్ధం చేసుకుని పెట్టుకున్నారని అంటున్నారు. కాగా ఇండియాలో సరోగసి ప్రాసెస్ ను నిషేధించారు. కొన్ని షరతుల ప్రకారమే అంగీకరించింది ప్రభుత్వం.
