ఇండస్ట్రీ ఏదైనప్పటికి హీరోయిన్‌ల కెరీర్ కాలం తక్కువగా ఉంటుంది. పోటాపోటి ఎక్కువ అయ్యే కొద్ది ముందున్న హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఈ మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో, దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని మహారాణిగా ఏలుతోంది నయనతార. విలక్షణ నటిగా, లేడీ సూపర్‌స్టార్‌గా , ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయన టాప్ లో ఉంది. స్టార్ హీరోలను మించి ఆమె సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 40 ప్లస్‌లో కూడా చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్‌లకు పోటీ ఇస్తుంది నయనతార. అయితే మూవీస్ విషయం పక్కన పెడితే.. వివాదాలతోనూ ఆమె అంతే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఒక ఇంట్రెస్టింగ్ విషయం పంచుకుంది.
Also Read: Kalki : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ !
నయన మాట్లాడుతూ ‘ హీరో పార్ధీబన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాతో నేను హీరోయిన్‌గా పరిచయం కావాల్సింది. ఆడిషన్ చేసి మరీ ఆయన నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల టైమ్‌కి లొకేషన్‌లో ఉండలేకపోయాను. తొలిరోజే లేట్‌గా రావడంతో ‘ఈ సినిమాకు నీతో పనిలేదు.. వెళ్లిపో’ అని ముఖంమీదే అనేశారు పార్ధీబన్. ఆయన అలా అన్నందుకు బాధ లేదు కానీ, అందరిముందూ అలా అనడంతో నా మనసు చివుక్కుమంది. క్షమించమని అడిగే ధైర్యం కూడా చేయలేకపోయా. తల దించుకొని వెనక్కి వెళ్లిపోయాను’ అంటూ గత చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు నయనతార.