Site icon NTV Telugu

Nayanthara : నయనతార విడాకుల వార్తలు.. షాకింగ్ ఫొటో వదిలిందిగా!

Nayanatara

Nayanatara

ఎంతోమందితో రిలేషన్‌లో ఉండి, తర్వాత బ్రేకప్ చెప్పిన నయనతార, చివరికి విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడి, ఆయన్నే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే, ఈ మధ్యకాలంలో వారి రిలేషన్ గురించి, విడాకులకు హింట్ ఇచ్చేలా నయనతార ఒక పోస్ట్ పెట్టడంతో, ఇంకేముంది, “నయనతార ఇతనితో కూడా సరిగ్గా లేదు, విడాకులు తీసుకుంటుంది” అంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు నయనతార కానీ, ఆమె టీమ్ కానీ, ల లేదా విగ్నేష్ శివన్ కానీ స్పందించలేదు.

Also Read:Udayabhanu : యాంకరింగ్ లో సిండికేట్ ఎదిగింది.. ఉదయభాను సంచలనం..

తాజాగా, నయనతార ఈ విషయంపై స్పందించింది. విగ్నేష్ శివన్ నేలపై పడుకుని ఉండగా, ఆయనపై ఎక్కి కూర్చున్న నయనతార, “మా గురించి కొన్ని పనికిమాలిన వార్తలు చూస్తున్నప్పుడు మా రియాక్షన్ ఇలాగే ఉంటుంది” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఒకే ఒక ఫోటోతో విడాకుల వార్తలకు ఆమె చెక్ పెట్టినట్లయింది.

Also Read:Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కేసు.. డీజీపీని రప్పించాల్సి ఉంటుందంటూ హెచ్చరిక?

ప్రస్తుతం, నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. తన రెగ్యులర్ బిహేవియర్‌కు భిన్నంగా, ఆమె సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో చేస్తూ ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో, ఒక్కసారిగా అందరి దృష్టి ఆ సినిమాపై పడింది.

Exit mobile version