NTV Telugu Site icon

Nayan Sarika: డిగ్రీ పరీక్షలు రాస్తూనే.. సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన్..

Untitled Design (6)

Untitled Design (6)

ఆగ‌స్ట్ 15న విడుద‌లైన చిత్రం ‘ఆయ్’. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుని ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంట‌గా న‌టించింది న‌య‌న్ సారిక‌. ఆయ్ స‌క్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోషించి ప‌ల్ల‌వి పాత్ర ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింద‌ని సంతోష‌ప‌డుతుంది న‌య‌న్ సారిక‌. ఈ సంద‌ర్భంగా ‘‘తెలుగు ప్రేక్ష‌కులు మా సినిమాను ఇంత గొప్ప‌గా ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజ‌యంతో నా ప్ర‌యాణం ప్రారంభం కావ‌టం నాకెంతో సంతోషానిస్తుంది” అని పేర్కొంది న‌య‌న్ సారిక‌.

Also Read: Jr. Ntr – Bunny : అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ మెచ్చిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

స్కూల్, కాలేజీల్లో డ్రామాల్లో న‌టించి న‌ట‌న‌పై మ‌క్కువ పెంచుకున్న న‌య‌న్‌కు ముందు నుంచి హీరోయిన్ కావాల‌నేది కోరిక‌. ‘ఆయ్’ సినిమాలో న‌టించాల‌ని ఆమెను మేక‌ర్స్ క‌లిసిన‌ప్పుడు న‌టిగా త‌న క‌ల నేర‌వేరుతుంద‌నే దానిపై చాలా సంతోష‌ప‌డింది. ‘‘ఆయ్’ సినిమా షూటింగ్ ప్రారంభం కావ‌టానికి ముందు నేను, నార్నే నితిన్ క‌లిసి రిహార్సల్స్, వ‌ర్క్ షాప్స్‌లో పాల్గొన్నాం. తెలుగు కోసం ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను ఇచ్చాం. నా టీమ్ స‌భ్యులు కూడా నాకెంతో స‌పోర్ట్ చేశారు’’ అని తెలియ‌జేసింది న‌య‌న్ సారిక‌.

Also Read: OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే..

డిగ్రీ చదువుతుండగానే నటిగా నయన్ సారికకు అవకాశం వచ్చింది. సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెప్పించాల‌నుకున్న క‌ల నేర‌వేరుతున్న‌ప్ప‌టికీ చ‌దువుని ఆశ్ర‌ద్ధ చేయ‌కూడ‌ద‌ని ఆమె నిర్ణ‌యించుకుంది. న‌టిస్తూనే డిగ్రీని పూర్తి చేయాల‌నుకుంది. ‘ఆయ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే ఫైన‌లియ‌ర్ డిగ్రీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యింది న‌య‌న్ సారిక‌. ‘‘షూటింగ్‌కి నేను బుక్స్‌, స్ట‌డీ మెటీరియ‌ల్ తీసుకెళ్లేదాన్ని. డిగ్రీ ఫైన‌లియ‌ర్ ఎగ్జామ్స్ పూర్తి చేయ‌టానికి నేను క్యారీవ్యాన్‌లో షూటింగ్ గ్యాప్‌లో చ‌దువుకుంటుండేదాన్ని. ఓ వైపు షూటింగ్, మ‌రో వైపు ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ కావ‌టం అనేది చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని షూటింగ్ రోజుల‌ను గుర్తుకు చేసుకుంది న‌య‌న్‌.

Show comments