Site icon NTV Telugu

Nayan : నెట్‌ఫ్లిక్స్‌లో ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ రిలీజ్

Nayanthara

Nayanthara

తమిళనాడు లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. కెరీర్ మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నేడు సోలోగా సినిమలు చేసే స్థాయికి ఎదిగింది నయనతార. కాగా కొన్నేళ్ల క్రితం యంగ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది నయనతార. 2022లో వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ తమ పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కు డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా హోల్ సేల్ గా రైట్స్ ఇచ్చేసారు. ఈ వివాహ వేడుకని ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ సినిమాగా తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్.

Also Read : AlluArjun : గుంటూరుకారం ట్రైలర్ వ్యూస్.. రికార్డు బద్దలు కొట్టిన పుష్ప -2

కాగా నయనతార, విగ్నేష్ ల పెళ్లి వేడుకను ఈ సోమవారం నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్. ఈ వేడుకలో తమిల్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ దంపతులు, రాధికా శరత్ కుమార్ దంపతులతో పాటు సంగీత దర్శకుకు అనిరుద్, మణిరత్నం, శివకార్తికేయన్ తో తమిళ పరిశ్రమకు చెందిన ఇతర నటీనటులు హాజరయ్యారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఆవుతోన్న ఈ డాక్యుమెంటరిలో కెరీర్‌ తొలినాళ్లలో నయన్‌ తార ఎదుర్కొన్న ఇబ్బందులు, గజినీ సినిమా టైమ్ లో వచ్చిన విమర్శలను షేర్ చేసుకున్నారు. అలాగే బాలకృష తో కలిసి చేసిన ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్రలో ఆమెను తీసుకున్నందుకు వచ్చిన వ్యతిరేక వార్తలు, ఆమె అనుభవించిన మానసిక క్షోభను వివరించింది. ఇక తాజగా ధనుష్ తో వివాదానికి కారణమైన నేను రౌడీనే సినిమా టైమ్ లో విగ్నేష్ తో వర్క్ చేస్తున్న క్లిప్ ను కుడా ఈ డాక్యుమెంట్రీలో జత చేసారు.

Exit mobile version