టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పొలిశెట్టి కూడా ఒకడు.పేరుకి హీరో అయినప్పటికి ‘జాతి రత్నాలు ’ మూవీలో తన కామెడీ టైమింగ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. చివరిసారిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ పొలిశెట్టి. ఈ మూవీ అనుష్క తో అతని కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.ఇక ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Also Read:Radhika Apte: బాత్రూమ్ లో ఆ పని చేస్తూ దొరికిపోయిన రాధికా ఆప్టే.. ఒక చేతిలో మందు ఇంకో చేతిలో..
ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఇప్పటికే మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోమో, టీజర్‌లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. అంతేకాదు రిలీజ్‌కి ముందే నాగ వంశీ ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసి సినిమాను ప్రాఫిట్ జోన్లో పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీ రైట్స్ ఎంత ధర పలికాయి అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. ఇక తాజాగా ఈ మూవీపై ఒక రూమర్ వినిపిస్తుంది. ఏంటంటే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్‌కి రాబోతుందట. ఆల్రెడీ ఈ రేస్ లో ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర తారల సినిమాలు కూడా ఉన్నాయి. దీని బట్టి నవీన్ చేస్తుంది పెద్ద సాహసం అనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.