NTV Telugu Site icon

Snakes and Ladders: మూడు షిఫ్టుల్లో ముగ్గురు దర్శకులు చేసిన ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’

స్టోన్ బెంచ్, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’కు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ ముగ్గురు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద, శ్రీజిత్ రవి, సమ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్యకుమార్, తరుణ్, సాషా భరేన్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆడియెన్స్, మీడియా ఆదరిస్తూనే ఉన్నారు.

Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..

ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటూ వచ్చాను. ఓ నలుగురు టీనేజ్ పిల్లలు, వారి జీవితంలో వచ్చిన ఓ అనూహ్య ఘటన, దాని నుంచి బయటకు రావడం అనేది ఈ కథ. కార్తీక్ సుబ్బరాజ్ టీం నుంచి ఈ కథ వచ్చింది. స్టోన్ బెంచ్‌లో చేయడం ఆనందంగా ఉంది. అమెజాన్ ప్రైమ్‌తో ఇది నా మూడో ప్రాజెక్ట్. నాకు ఇంత మంచి ఆఫర్లు ఇస్తున్న అమెజాన్ టీంకు థాంక్స్. ఇందులో కనిపించే నలుగురు పిల్లలు కొత్త వాళ్లు. వారంతా కూడా అద్భుతంగా నటించారు. ముగ్గురు దర్శకులు ఈ వెబ్ సిరీస్‌ను అద్భుతంగా మలిచారు. మూడు షిఫ్టుల్లో పని చేశారు. షూట్ మొత్తం కొడైకెనాల్‌లో చేశాం. ఒక్క సినిమాటోగ్రఫర్‌ విఘ్నేశ్ ముగ్గురు దర్శకులతో సింక్‌లో పని చేశారు. అక్టోబర్ 18 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆల్రెడీ బాగుందనే మెసెజ్‌లు వస్తున్నాయి. ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది. ఆడియెన్స్ సపోర్ట్‌తోనే ఇంత వరకు వచ్చాను. ఫ్యామిలీతో సహా ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.