పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా. ట్యాలెంటెడ్ సింగర్స్ మధ్య పోటీని ఆయన దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చేసాడు. నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోద శనివారం’.ఈ సినిమాలో తనకు ఇష్టమైన సాంగ్ ను ఇండియన్ ఐడల్ – 3స్టేజ్ పై రిలీజ్ చేసాడు . గాయకుడు కార్తీక్‌తో కలిసి సరిపోదా శనివారం నుండి ఇంకా విడుదల చేయని ”అనుకుండేయ్ జార్జిందా” అనే పాటను పాడటమే కాకుండా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అలరించాడు నేచురల్ స్టార్.
Also Read: Devara : ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ఈ స్పెషల్ సర్ ప్రైజ్ మూమెంట్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. మ్యూజికల్ హైలైట్‌తో పాటు, నాని ‘సరిపోద శనివారం’ గురించి పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు. వివేక్ ఆత్రేయ చెప్పిన స్క్రిప్ట్ వినగానే చాలా బాగా నచ్చింది. ఇది అందరికి కనెక్ట్ అయ్యే కథ తప్పకుండా ఆడియన్స్ కు నచ్చుతుంది అని అన్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ షో వేదికపై నాని సీజన్ 2లోనూ సందడి చేశారు. గతేడాది నాని నటించిన దసరా సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పట్లో ఈ షోలో పాల్గొన్నాడు. దసరా బ్లాక్ బస్టర్ సాధించిడంతో పాటు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా తెచ్చిపెటింది. ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ఆగస్టు 29న రిలీజ్ కానున్న సరిపోదా శనివారం ప్రమోషన్స్ ఇండియన్ ఐడల్ సీజన్ – 3లో పాల్గొన్నాడు ఈ నేచురల్ స్టార్.