Nani: ఏపీ ఎలక్షన్స్.. కన్ఫ్యూజన్లో నేచురల్ స్టార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani Next Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో రిలీజ్ కి కూడా రెడీ చేస్తున్న సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించే పనిలో పడింది. శనివారం నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని అదే బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సినిమా కాస్త లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుజీత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది కానీ కొంత భాగం షూట్ మాత్రం మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సిన పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే ఆయన ఏపీ ఎన్నికల హడావిడిలో బిజీ అయ్యారు.
Also Read
ఇక ఆయన ఈ మధ్యలో వచ్చి షూట్ పూర్తి చేస్తారా? లేక ఎన్నికల వరకు ఆగమని చెప్తారా? అనే విషయం మీద క్లారిటీ లేదు. ఒకవేళ ఎన్నికల వరకు ఆగమని చెబితే రెండు నెలల పాటు సుజిత్, పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆగాల్సి ఉంటుంది. అదే జరిగితే కనుక నాని సరిపోదా శనివారం షూటింగ్ పూర్తయింది కాబట్టి రెండు నెలలు టైం వేస్ట్ అవుతుంది అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుజిత్ లైన్ లోకి వచ్చే లోపు మరో సినిమా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయా అనే ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బలగం వేణు చెప్పిన కథకి నాని కనెక్ట్ అయ్యాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఓజి షూటింగ్ కనుక వాయిదా పడితే నాని బలగం వేణుతో సినిమా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఏపీ ఎలక్షన్స్ నానిని కన్ఫ్యూజన్లో పడేశాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి, ఏం జరగబోతోంది అనేది.
తాజావార్తలు
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!