NTV Telugu Site icon

FilmfareAwards: రికార్డు సృష్టించిన నేచురల్ స్టార్ నాని.. ఫిల్మ్ ఫేర్ చరిత్రలో మొదటిసారి..

Untitled Design (52)

Untitled Design (52)

69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను ప్రతిభను మెచ్చి, అవార్డులతో సత్కరించేందుకు ఫిలింఫేర్ ముస్తాబైంది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. రెడ్ కార్పెట్ పై తారలు హొయలు పొతూ , ఆధ్యంతం అలరించారు.

Also Read: Filmfare: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. తెలుగు విజేతలు ఎవరంటే..?

కాగా టాలివుడ్ హీరో నేచురల్ స్టార్ నాని రికార్డు సృష్టించాడు. ఫిల్మ్ ఫేర్ చరిత్రలోనే ఇటువంటి రికార్డు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది విడుదలైన సినిమాలలో అత్యుత్తమ నటన కనబరిచిన హీరోలలో స్టార్ హీరోలను వెనక్కి నెట్టి దసరా సినిమాకు గాను నాని ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే దసరా చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు అనుడుకున్నాడు శ్రీకాంత్ ఓదెల, అదే విధంగా దసరా చిత్రంలోని నటనకు ఉత్తమ నటి అవార్డు అందుకుంది కీర్తి సురేష్. దీంతో పాటు గతేడాది నాని నటించిన మరో సినిమా ‘హాయ్ నాన్న’. ఫీల్ గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రానికి గాను దర్శకుడు శౌర్యువ్ ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒక హీరో నటించిన రెండు సినిమాలకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్స్ రావడం, ఒకసినిమాకు బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకోవడం ఫిల్మ్ ఫేర్ హిస్టరీలోనే తొలిసారి కావడం విశేషం.

Show comments