Site icon NTV Telugu

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కేసు.. డీజీపీని రప్పించాల్సి ఉంటుందంటూ హెచ్చరిక?

Vijay Deverakonda

Vijay Deverakonda

విజయ్ దేవరకొండ కేసు లో కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది జాతీయ ఎస్టీ కమిషన్. తాజాగా సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. అసలు విషయం ఏమిటంటే ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు.

Also Read : Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్‌పై జక్కన్న గ్రాండ్ అప్డేట్..

ఇదే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టాడు కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని కమిషనర్ కు నోటీసులు ఇస్తే ఏసీపీ రావడం పట్ల సీరియస్ అయిన కమిషన్ సభ్యుడు మీరెందుకు వచ్చారు, ఆ మాత్రం తెలియదా అంటూ మాదాపూర్ ఏసీపీ పట్ల అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Also Read : IND vs ENG 3rd Test: లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేశాడు!

హీరో విజయ్ దేవరకొండ కేసు విచారణకు కమిషనర్ రాకుండా ఏసీపీ రావడం పట్ల అసహనం వ్యక్తం చేసింది జాతీయ ఎస్టీ కమిషన్. మరో 15 రోజుల్లో హైదరాబాద్ కమిషనర్ విచారణకు హాజరు అవ్వకపోతే, డీజీపీని విచారణకు రప్పించాల్సి ఉంటుందని ఏసీపీని హెచ్చరించింది జాతీయ ఎస్టీ కమిషన్. ఇక ఇదే అంశం మీద ఇప్పటికే విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని ఆయన అన్నారు.

Exit mobile version