Site icon NTV Telugu

Narne Nithin : ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Nithin

Nithin

ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ప్రజంట్ ‘శతమానం భవతి’ మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే మూవీ తో రాబోతున్నాడు నార్నె నితిన్ . ఆయన సరసన సంపద హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

Also Read : Khushi Kapoor : బికినీలో అక్కను మించిన ఎక్స్పోజింగ్ తో రెచ్చిపోయిన ఖుషీ కపూర్..

కాగా అత్యధిక థియేటర్లలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ మూవీ జూ 6న ప్రేక్షకులకు ముందుకు రానుందని అని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. ‘ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిగ్ హిట్ మూవీనీ నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక ‘శ్రీ శ్రీ రాజావారు’ విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా అధ్బుతంగా తీశారు. కచ్చితంగా ఈ జూన్ 6న నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో మరో సూపర్ హిట్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం’ అని తెలిపారు.

Exit mobile version