Site icon NTV Telugu

PM Modi: అక్కినేని నాగేశ్వరరావు కృషిని ప్రశంసించిన నరేంద్ర మోడీ

Anr Centenary Celebrations

Anr Centenary Celebrations

2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అమూల్యమైన సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించారు. “అక్కినేని నాగేశ్వరరావు తన కృషితో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువల వ్యవస్థను ఎంతో గొప్పగా పెంపొందించారు’ అని తెలియజేశారు. ANR తన ఏడు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు సినిమా వృద్ధి, విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించడం ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారు.

Drinker Sai: డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్ పై దాడి

తెలుగు, భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం, భారత ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి పురస్కరించుకుని ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. గోవాలోని IFFIలో ప్రత్యేక నివాళిగా ANR క్లాసిక్ చిత్రాలను ప్రదర్శించారు. ANR శతజయంతి జన్మదినాన్ని పురస్కరించుకుని, ANR ఫ్యామిలీ ఒక గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది, ఈ వేడుకలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిని ANR జాతీయ అవార్డుతో సత్కరించారు.

Exit mobile version