Site icon NTV Telugu

Nara Rohith: నేనూ పవన్ లాగే.. పాలిటిక్స్ పై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్

Nara Rohith

Nara Rohith

నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా బుధవారం, ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నారా రోహిత్ చాలా విస్తృతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆయన ప్రింట్ మరియు వెబ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌కు రాజకీయాల గురించి ఒక ప్రశ్న ఎదురైంది. “మీరు రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నానని చెప్పారు.

Also Read:ఫ్యాషన్ క్వీన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా హీట్ పెంచింది

అయితే మీలాంటి ఇంట్రోవర్ట్ రాజకీయాలకు సూట్ అవుతారని అనుకుంటున్నారా? ఎందుకంటే అక్కడ పొలిటికల్‌గా ముఖం మీద కొట్టినట్లు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి,” అని ప్రశ్నించగా, దానికి నారా రోహిత్ స్పందిస్తూ ఇలా అన్నారు, “నా పెదనాన్న పొలిటికల్‌గా ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను. అలాగే, నేను ఇంట్రోవర్ట్ అయినంత మాత్రాన పాలిటిక్స్‌లో సెట్ కాను అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో ఉన్నంతవరకు ఇంట్రోవర్ట్‌గానే ఉన్నారు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్లారో, అప్పుడు ఆయన తనదైన శైలిలో దూసుకుపోయారు. నేను కూడా రాజకీయాల్లోకి వెళితే, దీటైన విధంగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది,” అంటూ ఆయన మాట్లాడారు. ఇక నారా రోహిత్ సరసన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్‌తో పాటు వృత్తి వాగాని హీరోయిన్‌లుగా నటించారు. ఒక ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టీమ్ చెబుతోంది.

Exit mobile version