NTV Telugu Site icon

Nara Rohit : ట్విట్టర్ లో నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..

Nararohit

Nararohit

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూసారు. నేడు స్వస్థలం నారావారిపల్లెలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తండ్రిని కోల్పోయిన నారా రోహిత్ ఇన్నేళ్ళుగా తండ్రి రామ్మూర్తి నాయుడుతో తనకున్న ప్రేమ, ఆప్యాయతను తలచుకుంటూ నారా రోహిత్‌ ఎక్స్‌లో ఎమోషనల్ పోస్టు చేసారు.

నారా రోహిత్  ఎక్స్ ఖాతాలో  ‘ నాన్నా మీరొక ఫైటర్‌.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు నాన్నా. నాకు ప్రేమించడం, జీవితాన్ని ఎలా గెలవాలో మీరు నేర్పించారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు మీరే కారణం. ప్రజలను ప్రేమించడంతో పాటు.. మంచి కోసం పోరాడాలని మీరు ఎప్పుడు చెప్తుండేవారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు. నాన్నా.. మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు బై నాన్నా’’ అని నారా రోహిత్ తన తండ్రితో చిన్నతనంలో దిగిన ఫోటోను జత చేస్తూ పోస్ట్ చేసారు. రామ్మూర్తి నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయానా . తమ్ముడు. రామ్మూర్తి నాయుడు పలు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ సుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నేడు నారావారి పల్లెలో జరగనున్నఅంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.