హీరో నారా రోహిత్, తన తదుపరి ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. కరణ్ సి ప్రొడక్షన్స్బ్యా నర్‌పై ప్రొడక్షన్ నెం.5గా, భరత్ చౌదరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. చినిమిల్లి మణికుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీతో పాటు ఆకట్టుకునే కుటుంబ భావోద్వేగాలున్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రారంభోత్సవ వేడుక సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ కొరటాల క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.
‘ఆయ్’ సినిమా ఫేమ్ క్రేజీ హీరోయిన్ నయన్ సారిక ఈ చిత్రంలో నారా రోహిత్‌కు జోడీగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ఉన్న “Shouting Soon” అనే ట్యాగ్‌లైన్, కలర్‌ఫుల్ వైబ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించేలా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. జూన్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఈ ఏడాదే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
