పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జోరు చూస్తుంటే గత సినిమాల తాలూకు రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించిన దానికి మించి ఉండేలా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన హరిహర వీరమల్లు హంగామా కనిపిస్తోంది. పవర్ స్టార్ ను ఎప్పడెప్పుడు స్క్రీన్ మీదా చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో హరిహరుడు వీరతాండవం చేయబోతున్నాడు.
Also Read : HHVM : వామ్మో.. పవన్ స్టార్ రంగంలోకి దిగితే ఇలా ఉంటుందా
కాగా హరిహర వీరమల్లుకు అటు సినీ ప్రముఖులు.. ఇటు రాజకీయ ప్రముఖులు తమ అబినందనలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటి మినిస్టర్ నారా లోకేష్ హరిహర వీరమల్లుకు విషెష్ తెలియజేస్తూ ‘మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న చిత్ర బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ ఈ సినిమాను చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఆయన వ్యక్తిగత ఖాతాలో ట్వీట్ చేసారు. నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారా లోకేష్ కు కృతజ్ఞలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. నేడు ప్రీమియర్స్ తో విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాను పవర్ స్టార్ తో కలిసి నారా లోకేష్ స్పెషల్ చూడబోతున్నట్టు సమాచారం.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో… pic.twitter.com/NP9rw3eZkR
— Lokesh Nara (@naralokesh) July 23, 2025
