తన తండ్రి బాలకృష్ణ గురించి నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ఒక పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో ఒక్కొక్కరి చేత నందమూరి బాలకృష్ణ మీద అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కిన నారా బ్రాహ్మణి చిన్నప్పుడు తన తండ్రిని తాను తన సోదరి తేజు ఇద్దరు అపార్థం చేసుకున్నామని చెప్పుకొచ్చింది. ఆయన ఎప్పుడూ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలని లోపల ఏది అనిపిస్తే అది బయటికి అనేస్తారని చెప్పుకొచ్చింది.
Nara Lokesh: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసిన నారా లోకేష్
అలా అనే నేపథ్యంలో కొన్నిసార్లు ఈయన ఏంటి ఇలా అంటున్నాడు అని ఆయనని తప్పుగా అర్థం చేసుకున్నాం. కానీ ఎదిగిన తర్వాత అలా ఉండడం ఎంత అవసరమో అర్థమైంది. అలాగే అలా ఉండడం ఎంత కష్టమో కూడా అర్థమైంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గ్రాఫ్ పెరగడానికి తానే కారణమని చిన్న కుమార్తె తేజస్విని చెప్పుకొచ్చింది. ఆమె సరదాగానే ఆ మాట అన్నా అభిమానులు మాత్రం నందమూరి బాలకృష్ణ గ్రాఫ్ పెరగడానికి కారణం ఆమెనే అని కామెంట్ చేస్తున్నారు.